Vaman Rao: లాయర్ వామన్‌రావు హత్యకేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
Vaman Rao: బిట్టుశీను, కుంటశీనుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Vaman Rao: తేలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామనరావు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితులుగా ఉన్న బిట్టు శీను, కుంట శీనుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు బతికుంటే సమస్యగా భావించారు. అందుకు హత్యే పరిష్కారంగా బిట్టు భావించారు. హత్యకు బిట్టు శీను నాలుగు నెలల క్రితమే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసం నాలుగు నెలల క్రితం గుంజపడుగు పాత స్కూల్ బిల్డింగ్ నుంచి రెక్కి నిర్వహించారు. వామన్‌రావు చుట్టూ జనాలు ఉండడంతో అప్పుడు ప్లాన్ ఫెయిల్యుర్ అయింది..
ఈ నెల 17న వామనరావు ఒంటరిగా దొరకడంతో హత్యకు బిట్టు శీను, కుంట శీనులు కలిసి ప్లాన్ చేశారు. కల్వచర్ల దగ్గర వామన్‌రావు హత్య తర్వాత బిట్టు శీను ఫోన్ చేసి పని అయిపోయినట్టు చెప్పాడు. హత్య తర్వాత కుంట శీను అండ్ గ్యాంగ్‌ను మహారాష్ట్ర వెళ్లిపొమ్మని బిట్టు శీను సలహా ఇచ్చాడు. వామన్‌రావు మర్డర్ తర్వాత బిట్టు శీను రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాదు.. హత్యకు కొన్ని రోజుల ముందే వేరే సిమ్ కొనుగోలు చేసి కుంట శీనుతో టచ్‌లో ఉన్నట్టు రిమాండ్ రిపోర్ట్ పొందుపరిచారు.