CBI: కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదు
CBI: శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న.. రూ.14కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించాం
CBI: ఎమ్మెల్సీ కవిత సీబీఐ రిమాండ్ పిటిషన్‌లో కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. కస్టడీలో ఎమ్మెల్సీ కవిత తమ విచారణకు సహకరించలేదని తెలిపారు. శరత్‌చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు రిమాండ్ పిటిషన్‌లో తెలిపారు. లేని భూమిని ఉన్నట్లుగా చూపి అమ్మడానికి పాల్పడిన విషయంపై కవిత ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు.
ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఇస్తున్నారని తమ రిమాండ్ పిటిషన్‌లో తెలిపారు సీబీఐ అధికారులు. మాగుంట శ్రీనివాసులు, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినట్లు తెలిపారు. విచారణను, సాక్షులను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేయగలరంటూ సీబీఐ తెలిపింది.