KCR: ఆహారం ప్రజల ప్రాథమిక హక్కు
*మన దేశంలో బఫర్ స్టాక్‌లు ఏర్పాటు చేయాలి: సీఎం *దేశ వ్యాప్తంగా ఎఫ్‌సీఐ గోడౌన్స్ ఉంటాయి: సీఎం
KCR: దేశ ప్రజలకు ఆహారం అనేది ప్రాథమిక హక్కు అని సీఎం కేసీఆర్ అన్నారు. కొన్నిదేశదేశాల్లో ఆహార కొరత లేకండా బఫర్ స్టాక్‌లు ఏర్పాటు చేసుకుంటారని తెలిపారు అయితే మనదేశంలో కేంద్రానికి సంబంధించినవే అత్యధికంగా గోడౌన్స్ ఉన్నాయని అన్నారు. అయితే రాష్ట్రాల పంటలను కొనకుండా మెలిక పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని ఆ బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసినట్లయితే ఆహార ధాన్యాల కొరత సమయాల్లో వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఈజీగా ఉంటుందన్నారు.