కేసీఆర్ ప్లాన్- బి..? ఈనెల 18న మోడీ బాంబ్ పేల్చబోతున్నారా..?

KCR Plan-B: మినీ జమిలీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ వ్యూహమేంటి...?

Update: 2023-09-13 13:18 GMT

కేసీఆర్ ప్లాన్- బి..? ఈనెల 18న మోడీ బాంబ్ పేల్చబోతున్నారా..?

KCR Plan-B: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేది ఎప్పుడు..? షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా లేక వాయిదా పడనుందా..? కేంద్రం మదిలో ఏముంది..? సెప్టెంబర్ 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ ఏం బాంబ్ పేల్చబోతున్నారు. ఒకవేళ మినీ జమిలీ ఎన్నికలు జరిగితే కేసీఆర్ వ్యూహం ఏంటి..? రాజకీయంగా కాస్త అడ్వాన్స్‌గా ఆలోచించే గులాబీ బాస్.. ప్రత్యర్థులను దెబ్బకొట్టేలా ప్లాన్ బీ అమలు చేయబోతున్నారా..? పార్లమెంట్ తో కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..? ఎన్నికల వాయిదాపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో.. ఏదైన స్కెచ్ ఉందా..?

డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని.. 2నెలల ముందే 115స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు కేసీఆర్. ప్రతిపక్షాలు మేల్కొనే లోపే ప్రచారంతో దూసుకెళ్లాలని ప్రణాళిక రచించారు. అక్కడక్కడ కొంత అసంతృప్తులు వెల్లువెత్తినా.. వారిని బుజ్జగిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ జమిలీ ఎన్నికల ప్రచారంతో కారు స్పీడ్‌కు కాస్త బ్రేక్ పడినట్టైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసి వచ్చే ఏడాది పార్లమెంట్‌తో కలిపి జరపాలని కేంద్రం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు బలం చేకూర్చేలా బీజేపీ సర్కార్ సెప్టెంబర్‌లో ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడంతో తెలంగాణ అసెంబీ ఎన్నికలు వాయిదా పడనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిన్నటి వరకు ప్రచారంతో జోరు చూపించిన గులాబీ అభ‌్యర్థులు.. కాస్త రిలాక్స్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకే సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.

అటు, అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలంటే.. అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ రావాలన్నారు. లేదంటే వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈనెల 18న జరిగే ప్రత్యేక పార్లమెంట్స్ సమావేశాల తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందన్నారు కేటీఆర్. దీంతో డిసెంబర్‌లో ఎలక్షన్స్ జరిగేది ఫిఫ్టీ, ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే. ఐదు రాష్ట్రాల అంసెబ్లీ ఎన్నికలను వాయిదా వేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్, చత్తీష్‌గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం రెండు రాష్ట్రాల్లోనే. మిజోరంలో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్, చత్తీష్‌గడ్ లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ పవర్ లో ఉన్నాయి.

కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుందని మోదీ ఆలోచన కావొచ్చు. ఇందులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. ఇక మోదీ పని అయిపోయిందని.. విపక్షాలు ఎదురుదాడి చేస్తాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా జరిగితే.. ప్రాంతీయ అంశం ముందుకు వస్తుంది. లోకల్ ఇష్యూ బేస్‌డ్ గా ఎన్నికలు జరుగుతాయి. మోదీ హవా అంతగా పని చేయదు. రీసెంట్‌గా కర్ణాటక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది బీజేపీ. మోదీ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అదే లోక్ సభ ఎన్నికలతో జరిపితే.. జాతీయ అంశం తెరపైకి వస్తాయని. మోదీ గాలిలతో.. ప్రత్యేర్థులను దెబ్బకొట్టాలనేది కాషాయపార్టీ వ్యూహం కావచ్చు.

2018లో ముందస్తుకు వెళ్లిన కేసీఆర్.. సంపూర్ణ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే. చాలా చోట్ల బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అదే లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి.. 4స్థానాలు గెలుచుకుంది బీజేపీ. మోదీ వర్సెస్ ఇతరులు అన్నట్టుగా ఎన్నిక జరగడమే ఇందుకు కారణం. ఈ అంశాలన్నింటినీ బేరిజు వేసుకునే బీజేపీ మినీ జమిలీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు. రాజ్యంగ సవరణలు చేసి.. రాష్ట్రాల ఆమోదం పొందడం అంతా ఈజీ కాదు. ఆ విషయం కేంద్రానికి కూడా తెలుసు. కానీ జమిలీ పేరుతో.. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలని మోదీ వ్యూహంగా ప్రతిపక్షాలు చూస్తున్నాయి.

ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే కేసీఆర్ ప్లాన్ బి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అల్రేడీ ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారా అనే ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తోన్న కేసీఆర్.. లోక్ సభ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. అసెంబ్లీకి, పార్లమెంట్‌కు వేరువేరుగా ఎన్నికలు జరిగితే.. ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను కొందరిని లోక్ సభ పోటీలో నిలపాలని కేసీఆర్ ప్లాన్. కానీ ఇప్పుడు మినీ జమిలీ జరిగితే.. కొంతమంది అసెంబ్లీ అభ్యర్థులను మార్చి.. వారిని లోక్ సభ పోటీలో నిలుపనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పథకాల్లో మరింత స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. అమ్ముల పొదిలో ఉన్న సంక్షేమ అస్త్రాలను కూడా బయటకు తీయాలని చూస్తున్నారట. ఓ వైపు పథకాలను లబ్ధిదారులకు చేర్చుతూ..మరోవైపు కాంగ్రెస్, బీజేపీని తీవ్రంగా ఎండగట్టాలని చూస్తున్నారట.

ఇదిలా ఉంటే.. నిన్న ఎన్నికలపై కేటీఆర్ చేసిన మాటలు.. ప్రతిపక్షాలను ఆలోచనలో పడేసాయి. ఇప్పట్లో ఎన్నికలు ఉండవు అనే ఆలోచనలో వారిని నెట్టేసి తమ పని తాము చేసుకుంటూ పోవచ్చనే వ్యూహం దాగుంది అంటున్నారు. పార్టీలో అసంతృప్తులు, ఎన్నికల ఖర్చు నేపథ్యంలో.. ప్రతిపక్షాలు ఇప్పట్లో పోటీ చేసే క్యాండిడేట్స్ ను ప్రకటించవు. మరింత ఆలస్యం చేస్తాయి. దీంతో తమ పని మరింత సులువు అతుందని కేసీఆర్ యోచించినట్టతెలుస్తోంది. అటు సొంత పార్టీలో పోటీ చేసే అభ్యర్దులును ముందే ప్రకటించారు కాబట్టి పార్టీ మారే వారికి దాదాపు చెక్ పడింది. దీంతో తాము అనుకున్న రెండు ప్లాన్స్ సక్సెస్ అవుతాయని బావిస్తున్నారట కారు పార్టీ అధినేత. మొత్తానికి యువనేత కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ తరుపున వ్యూహత్మకంగానే అన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News