పదవుల పండగ..! నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ కసరత్తు...

Nominated Posts: *తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 67 కార్పొరేషన్లు *త్వరలో 50 కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు..!

Update: 2022-03-31 05:37 GMT

పదవుల పండగ..! నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ కసరత్తు...

Nominated Posts: తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. పార్టీలన్నీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునీ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలతో పాటు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు పదవుల పంపిణీ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. చాలా కాలంగా గులాబీ పార్టీ నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ కోసం శ్రమించి పని చేసే నాయకులను గుర్తించి పదవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

అటు నామినేటెడ్ పదవులతో పాటు.. యువతకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనేది సీఎం కేసీఆర్ ప్లాన్. దాంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపితే, తద్వారా ఎన్నికల్లో వారు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. అది కూడా ఈ ఉగాది తర్వాత భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన లిస్టును సైతం రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం.

నామినేటెడ్ పదవుల కోసం చాలాకాలం నుంచి నేతలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు కేసీఆర్ ఈ భర్తీలు చేపట్టేందుకు సిద్ధమైనా, ఏదో ఒక కారణంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో నేతలంతా తమ లాబీయింగ్‌ని ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడితో.. పార్టీ నేతలు అటువైపు వెళ్ళకుండా సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేయడానికి పదవుల ఎర వేస్తున్నారని చర్చించుకుంటున్నారు. దీంతో పార్టీలో అసంతృప్తులను తగ్గించేందుకు నామినేటెడ్ పదవులను భర్తీతో చెక్ పెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.

సీఎం కేసీఆర్ విడతలవారీగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 67 కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో 50 కార్పొరేషన్ల భర్తీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం నుంచి నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఇటీవల రెండు దఫాలుగా కొన్ని పదవులు నామినేటెడ్ ఇవి నియమించారు.

ఇక మిగతా కార్పొరేషన్ పదవుల భర్తీలోనూ కులాలవారీగా ప్రాధాన్యం కల్పిస్తూ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారట. పార్టీ కోసం ఉద్యమ కాలం నుంచి పోరాడుతున్న వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పదవుల భర్తీ సమయంలో అసంతృప్తులు తలెత్తకుండా వివాదాలకు దూరంగా ఉండే వారిని ఎంపిక చేయాలని సీనియర్ నాయకులకు పదవులతో తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా కేసీఆర్ లిస్ట్ సిద్ధం చేసుకున్నారట.

Tags:    

Similar News