Telangana: సరిగ్గా అమలు కాని కేసీఆర్ కిట్ పథకం

Telangana: ఏడాదిగా బాలింతలకు అందని నగదు బదిలీ

Update: 2022-09-03 02:05 GMT

Telangana: సరిగ్గా అమలు కాని కేసీఆర్ కిట్ పథకం

Telangana: ఆడబిడ్డకు జన్మనిస్తే 13 వేల రూపాయలు.. మగ బిడ్డకు జన్మనిస్తే 12 వేల రూపాయల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. నగదు రూపంలో వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఏడాది గడుస్తున్నా కూడా బాలింతలకు అండగా నిలిచే కేసీఆర్ కిట్టు పథకం నిధుల కొరతతో లబ్ధిదారులకు అందడం లేదు.

గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం KCR కిట్ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. పేద గర్భిణి స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం ద్వారా లబ్ధిదారులకు రావాల్సిన డబ్బులు నిధుల కొరతతో అందటం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి నిరాశతో లబ్ధిదారులు వెనుదిరుగుతున్నారు. ప్రసవించి ఏడాది గడుస్తున్నా రావల్సిన ప్రభుత్వ ప్రోత్సాహకం అందకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన ప్రోత్సాహం ఏడాది గడుస్తున్నా అందటం లేదని.. మహిళలు చెబుతున్నారు. తాము ఆసుపత్రి సిబ్బందిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని లబ్ధిదారులు అంటున్నారు.

పేద గర్భిణీ మహిళలకు ఆర్థికంగా ఎంతో కేసీఆర్ కిట్ పథకం తోడ్పాటునందిస్తుందని భారీగా ప్రచారం చేసిన ప్రభుత్వం...కిట్టును మాత్రమే అందించి ఇంటికి పంపుతున్నారని..వారికి రావల్సిన డబ్బులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిధుల కొరతను అధిగమించి లబ్ధిదారులకు చెందాల్సిన నగదును వారి ఖాతాలో జమ చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News