CM KCR: కేసీఆర్ డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్
CM KCR: 119 అసెంబ్లీ సీట్లు ఉంటే ఏకంగా 115 సీట్లకు అభ్యర్ధుల ఖరారు
CM KCR: తెలంగాణాలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉంటే ఏకంగా 115 సీట్లకు అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించేశారు ... ఇక నాలుగు సీట్లు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నాయి. రేపో మాపో ఆ సీట్లను కూడా ప్రకటిస్తారు ఇక ముందే ప్రచారం జరిగినట్లుగానూ కేసీఆర్ తానుగా చెప్పినట్లుగానూ సిట్టింగులకు పూర్తి న్యాయం చేశారు. ఎనిమిది మందికి తప్పించి అందరికీ టికెట్లు ఇచ్చేశారు. ఒక విధంగా కేసీఆర్ డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్ గా దీన్ని చూస్తున్నారు..
2018 నాటి ఎన్నిక కాదు, అప్పట్లో నాలుగున్నరేళ్ళ పాటు కేసీఆర్ పాలన సాగింది. ప్రజల్లో వ్యతిరేకత ఎంతోకొంత ఉంటుంది. ఇప్పుడు తొమ్మిదిన్నరేళ్ల పాలన ముగిసిన తరువాత జనాల్లోకి వెళ్ళి మళ్లీ తీర్పు అడగాల్సిన నేపధ్యం ఉంది... దాంతో పాటు విపక్షాల గ్రఫ్ బాగా పెరిగింది. తెలంగాణాలో ఉద్యమ ప్రభావం, సెంటిమెంట్ కూడా తగ్గిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ కి కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణాలో ఒక్కసారిగా ఊపు పెరిగింది. ఈసారి కచ్చితంగా అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే కాంగ్రెస్ నేతలలో ఎన్నడూ లేని ఐక్యత కనిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ కూడా గట్టిగా పట్టు బిగించాలని అనుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి అడ్వాంటేజ్. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ మొత్తం 115 మంది అభ్యర్ధులను ప్రకటించడం అంటే డేరింగ్ స్టెప్ అనే అంటున్నారు... దాదాపు సిట్టింగులకు అందరికీ సీట్లు ఇచ్చారు. దాంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో మిగిలారు. వారికి బుజ్జగింపులు చేస్తున్నారు పార్టీ పెద్దలు... రానున్న రోజుల్లో రాజకీయ అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేతల మధ్య సయోధ్య కుదురుస్తున్నారు.
ఇక టికెట్ నిరాకరించిన ఎనిమిది మంది రూట్ ఎటూ అన్నది చర్చగా ఉంది.అదే సమయంలో సిట్టింగులకు టికెట్లు పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తి సెగలు రేగకుండా కేసీఆర్ చూసుకున్నారని అంటున్నారు. కానీ వారి మీద జనంలో ఉండే వ్యతిరేకత ఎంతవరకూ మైనస్ అవుతుంది అన్నది కూడా ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇక కేసీఆర్ దాదాపుగా టోటల్ గా అభ్యర్ధులను ప్రకటించేసి విపక్షాలకు చాన్స్ ఇచ్చారా లేక కార్నర్ చేశారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. విపక్షాలకు ఇది సులువైన వ్యవహారమా లేక ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా అన్నది కూడా చర్చకు వస్తోంది. అయితే విపక్షాలు ఇపుడు తాపీగా కేసీఆర్ నిలబెట్టిన అభ్యర్ధులకు ధీటైన వారిని ఎంపిక చేసుకునే చాన్స్ ను అందుకుంటున్నాయని అంటున్నారు.
అదే టైంలో సిట్టింగుల పట్ల వ్యతిరేకత ఉంటే దాన్ని సొమ్ము చేసుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇక బీయారెస్ లోని ఆశావహులను తన వైపునకు తిప్పుకునేందుకు వీలుంటుంది. అయితే గులాబీ బాస్ తొందరగా అభ్యర్ధులను ప్రకటించడం వల్ల జనంలో వారు ప్రచారానికి వేగంగా వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే అసంతృప్తులు ఏమైనా ఉంటే కూడా సెట్ చేసుకునేందుకు వీలు కుదురుతుంది అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే 2018లో కేసీఆర్ అభ్యర్ధులను ముందస్తుగా ప్రకటించి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఈసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్నదే పాయింట్. అయితే కేసీయార్ కి ఉన్న ధీమా ఒక్కటే. విపక్షాలు రెండూ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చుకుంటాయని. కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవవు. అందువల్ల పోటీ గట్టిగా ఉన్నా తక్కువ ఓట్ల తేడాతో బయటపడిపోవచ్చు అన్న లెక్క కూడా ఉందిట. ఏది ఏమైనా కేసీఆర్ డేరింగ్ డెసిషన్ కేవలం తెలంగాణా రాజకీయాలకు మాత్రమే పరిమితం. కేసీఆర్ రెడీ అంటూ సవాల్ విసిరారు ఇపుడు రెస్పాండ్ కావడం రాష్ట్ర ప్రతిపక్షాల చేతిలో ఉంది.