MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

MLC Kavitha: తన పిటిషన్‌పై ఇవాళే అత్యవసర విచారణ చేపట్టాలని వినతి

Update: 2023-03-17 04:17 GMT

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన పిటిషన్‌పై ఇవాళే అత్యవసర విచారణ చేపట్టాలని విన్నవించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో క‌వితను మార్చి 11వ తేదీన ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉద‌యం 11 గంట‌ల నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు క‌విత‌ను విచారించారు. కాగా, మార్చి 16వ తేదీన మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తాను మార్చి 16 వ తేదీన హాజ‌రుకాలేనని ఈడీకి మెయిల్ చేశారు.

అదే స‌మ‌యంలో ఈడీ విచార‌ణ నుండి త‌న‌కు స్టే ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. కాగా, క‌విత పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈనెల 24 వ తేదీన విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, మార్చి 20 వ తేదీన మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ నోటీసులు జారీ చేసిన నేప‌థ్యంలో మ‌రోసారి క‌విత సుప్రీంకోర్టు త‌లుపులు త‌ట్టనున్నారు. ఇవాళ మ‌రోసారి సుప్రీంకోర్టులో విచార‌ణ‌పై ప్రత్యేక ప్రస్తావ‌న చేయ‌నున్నారు. మార్చి 20వ తేదీలోగా విచార‌ణ చేప‌ట్టాల‌ని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News