Kasireddy Narayan Reddy: ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే 24గంటలూ సేవ చేస్తా
Kasireddy Narayan Reddy: ఎమ్మెల్సీగా కల్వకుర్తి ప్రజలు ఆదరించారు
Kasireddy Narayan Reddy: కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆమన్‌గల్ ఎంపీపీ అనితా విజయ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బృంగి ఆనంద్ కుమార్‌తో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన కల్వకుర్తిలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు...
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. మైసిగండి మైసమ్మ దేవాలయం, కల్వకుర్తిలోని హనుమాన్ దేవాలయం, కల్వకుర్తిలోని దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తనను ఇప్పటివరకు ఎమ్మెల్సీగా కల్వకుర్తి ప్రజలు ఆదరించారని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే 24 గంటలూ కల్వకుర్తి ప్రజల కోసం పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.