TS High Court: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా ఎం.ఎస్. రామచంద్రరావు
TS High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.
TS High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ బదిలీ కావడంతో సీనియర్ న్యాయవాదిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. సీజే కార్యాలయం బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయగా కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు.
నగరంలోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో, బీఎస్సీ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. ఎల్ఎల్‌బీ తృతీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించినందుకు సీవీఎస్ఎస్ ఆచార్యులు గోల్డ్ మెడల్‌ను రామచంద్రరావు అందుకున్నారు. 1989, సెప్టెంబర్ నెలలో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నారు. 1991లో యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా సాధించారు.