Jupally: బడ్జెట్‌పై కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదం

Jupally Krishna Rao: బడ్జెట్‌పై కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

Update: 2024-07-26 13:00 GMT

Jupally: బడ్జెట్‌పై కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదం

Jupally Krishna Rao: బడ్జెట్‌పై కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు. కేసీఆర్ గ్యాస్, ట్రాష్ వ్యాఖ్యలను మంత్రి జూపల్లి దుయ్యబట్టారు. వాస్తవాలకు దగ్గరగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే గ్యాస్, ట్రాష్ ఎలా అవుంతుందని మంత్రి జూపల్లి కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ తన మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగే... దొంగ దొంగ అని అరిచినట్లుగా కేసీఆర్, హరీశ్ రావుల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News