Jukkal: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జుక్కల్ తహాసీల్దార్

జుక్కల్ ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ తహాసీల్దార్ వెంకటేష్ పరిశీలించారు.

Update: 2020-04-23 10:53 GMT

జుక్కల్  ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ తహాసీల్దార్ వెంకటేష్ పరిశీలించారు. మండలంలోని కేంరాజ్ కల్లలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిపరిశీలించారు. ఈ సందర్బంగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి గ్రామంలో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నామని దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు గాను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ తగు జాగ్రత్త లు తీసుకోవాలని ఐ కె పి సిబ్బంది కి సూచించారు. ప్రభుత్వం ద్వారా క్విoటాలుకు ఏ గ్రేడ్ రకానికి 1835. బి గ్రేడ్ రకానికి 1815రూపాయలచొప్పున మద్దత్తు ధరను కల్పించడం జరిగిందని ప్రతి రైతు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలవద్దనే విక్రయించాలని రైతులకు సూచించారు.

ధాన్యం విక్రయంలో దళారులను నమ్మిమోసపోవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద తూకం చేసే హమాలీలకు మాస్క్ తప్పనిసరిగా ఉండాలని, వారు భోజనం చేసేటప్పుడు శానిటైజర్ కాని, సబ్బుతో కళ్లు చేతులను శుభ్రంగా కడుక్కొని భోజనం చేసేల సంభందిత సొసైటీ సిబ్బంది తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కులకర్ణి రమేష్ దేశాయి, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, ఐకెపిసిసి సాయిలు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News