Pedda ghulla: పెద్ద గుల్ల గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్ద గుల్ల మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో గురువారం జుక్కల్ సొసైటీ చైర్మన్ ఎన్.శివానంద్, మార్కెట్ కమిటీ డైరక్టర్ సంజయ్ పాటిల్, సొసైటీ డైరక్టర్ విట్టల్ పాటిల్ చేతుల మీదుగా శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Update: 2020-04-17 02:20 GMT

పెద్ద గుల్ల మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో గురువారం జుక్కల్ సొసైటీ చైర్మన్ ఎన్.శివానంద్, మార్కెట్ కమిటీ డైరక్టర్ సంజయ్ పాటిల్, సొసైటీ డైరక్టర్ విట్టల్ పాటిల్ చేతుల మీదుగా శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తునందున రైతులు తమ శనగ ను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని రైతులకు సూచించారు.

కొనుగోలు కు ప్రభుత్వం ద్వారా క్వి.4,800 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నందున రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజి తెరాస మండల అధ్యక్షుడు నిలు పాటిల్, తెరాస మండల అధ్యక్షుడు బొల్లి గంగాధర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గంగు నాయక్, మాజి మార్కెట్ కమిటి డైరక్టర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News