MLC Kavitha: కాసేపట్లో తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ... తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది.
కేసుకు సంబంధించి మెటీరియల్ ఇవ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నామని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఏప్రిల్ ఒకటో తేదీకల్లా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈడీ తన జవాబు చెప్పాలని పేర్కొంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని.. నిందితుల అక్రమ సొమ్ము మూలాలను వెలికితీయాల్సి ఉందని తెలిపింది. ఇక ఇందులో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులను గుర్తించాల్సి ఉందని.. సాధారణ నేరాలకంటే ఆర్థికనేరాల దర్యాప్తు చాలా కఠినమైందని పేర్కొంది. అందుకే నిందితురాలికి ఏప్రిల్ 9వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నామన్నారు. జైలులో ఆమెకు ఇంటి భోజనం.. బెడ్, స్లిప్పర్స్, దుస్తులు, బ్లాంకెట్, బుక్స్, పెన్ను, పేపర్, జ్యువెల్లరీ, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు తీహార్ జైలు సూపరింటెండెంట్ అనుమతించాలని కోర్టు ఆదేశించింది.