జూబ్లీహిల్స్ అత్యాచార నిందితుల బెయిల్‌పై నేడు తీర్పు
*బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పోలీసులు
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై కోర్టులో విచారణ జరుగనుంది. ఆరుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జువెనైల్ జస్టిస్ బోర్డ్‌లో ఐదుగురు సీసీఎల్‌లు పిటిషన్ దాఖలు చేశారు. సాదుద్దీన్ మాలిక్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. పోలీస్ కస్టడీ పూర్తి అయినందున బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు నిందితుల తరుపు న్యాయవాది. అయితే ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. నేడు జువెనైల్ జస్టిస్ బోర్డ్, నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనున్నాయి.