Hyderabad: హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం
Hyderabad: తెలంగాణలోని జిల్లాల నుంచి ఇరు పార్టీల కార్యకర్తలు హాజరు
Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సీపీఐ, సీపీఎం ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. సభా ప్రాంగణనికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ చేరుకున్నారు. తెలంగాణలోని మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి రెండు కమ్యునిస్టు పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు.