Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ

Telangana New Governor:పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. దేశంలని 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి.

Update: 2024-07-28 01:41 GMT

Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ

Telangana New Governor: తెలంగాణ రాష్ట్రంతో సహా దేశంలోని 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ, రాజస్థాన్, సిక్కిం, అస్సోం , మేఘాలయ, చత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. మహారాష్ట్ర గవర్నరుగా సీపీ రాధాక్రుష్ణన్ నియమితులవ్వగా..తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు.

జిష్ణుదేవ్ వర్మ బ్యాక్ గ్రౌండ్ ఇదే

జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బీజేపీ సీనియార్ నేతగా ఛారిలమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం త్రిపుర డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. 1957 ఆగస్టు 15న జిష్ణుదేవ్ వర్మ జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990 దశకంలో రామజన్మభూమి ఉద్యమ సమయంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో కీలకం వ్యవహారిస్తూ వచ్చారు. త్రిపుర ప్రభుత్వం మంత్రిగా విద్యుత్ గ్రామీణాబివ్రుద్ధి, పంచాయతీ రాజ్, ఆర్థిక, ప్రణాళి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖలను నిర్వహించారు.

9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వీరే:

1.తెలంగాణ జిష్టు దేవ్ వర్మ

2.రాజస్థాన్ హరిభౌ కిషన్ రావు బాగ్డే

3.సిక్కిం ఓం ప్రకాశ్ మాధుర్

4.జార్ఘండ్ సంతోష్ కుమార్ గంగ్వార్

5.మేఘాలయ సీహెచ్ విజయ శంకర్

6.మహారాష్ట్ర సీపీ రాధాకృష్ణన్

7.పంజాబ్ గులాబ్ చంద్ కటారియా

8.అస్సోం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య

9.ఛత్తీస్ గడ్ రామెన్ డేక

Tags:    

Similar News