Jagga Reddy - Revanth Reddy: తనదే తప్పు అని ఒప్పుకున్న జగ్గారెడ్డి

Jagga Reddy - Revanth Reddy: *రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వెల్లగక్కిన జగ్గారెడ్డి *తనదే తప్పు అంటూ ప్రకటన

Update: 2021-09-26 10:11 GMT

జగ్గారెడ్డి - రేవంత్ రెడ్డి (ఫోటో- ది హన్స్ ఇండియా)

Jagga Reddy-Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన వివాదం టీ కప్పులో తుఫానులా చల్లారింది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బయట మాట్లాడటం తప్పే అని జగ్గారెడ్డి చెప్పడంతో వివాదానికి పుల్‌స్టాప్ పడింది. కమ్యునికేషన్ గ్యాప్ ఉన్నది వాస్తవమే అంటూ పార్టీ ఆర్గనైజింగ్ ఇంఛార్జి మహేష్ గౌడ్ ప్రకటించడంతో వ్యవహారం సద్దు మనిగింది. తెలంగాణ కాంగ్రెస్‌లో టిపీసీసీ చీఫ్ రేవంత్ పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నా జిల్లాకు వచ్చి నాకే సమాచారం ఇవ్వావా? అంటూనే కాంగ్రెస్ పార్టీనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. ఏకంగా జగ్గారెడ్డి మీడియాలో విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది.

దీనిపై ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ సీరియస్ అయ్యారు. వ్యవహారం పై నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాసన్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ లను ఆదేశించారు. దీంతో గాంధీభవన్‌లో జగ్గారెడ్డిని పిలిచి మాట్లాడారు. ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందని వివరణ అడిగారు. కమ్యునికేషన్ గ్యాప్ తోనే సమస్య వచ్చిందని ప్రకటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్. గ్యాప్ లేకుండా చూస్తాం సమస్య సర్డుమనిగింది అని ప్రకటించారు.

ఏఐసీసీ కార్యదర్శులకు జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. గజ్వెల్ సభలో తనకు మాట్లాడనివ్వకుండా అవమానించారని, జహీరాబాద్ జిల్లాల్లో పీసీసీ పర్యటించిన తనకు సమచారం ఇవ్వలేదని జరిగిన ఘటనలను కార్యదర్శులకు వివరించారు. తను లెవనెత్తిన అంశాలల్లో ఏదీ తప్పు లేదని జగ్గారెడ్డి వారికి వివరించారు. అయితే అది పొరపాటే అని ఒప్పుకున్నారు జగ్గారెడ్డి. అన్నదమ్ములు అన్నప్పుడు సమస్యలు ఉంటాయి కూర్చొని మాట్లాడుకుంటామని జగ్గారెడ్డి ప్రకటన చేశారు. తన తప్పు జరిగిందని టిపీసీసీ వైపు నుండి కూడా తప్పు జరిగిందన్నారు. మళ్లీ రిపీట్ కాదు అని ప్రకటించారు. క్యాడర్ అపోహలకు పోకండి అని కోరారు.

Tags:    

Similar News