మంత్రులు భజన మండలి మానుకోవాలని : జగ్గారెడ్డి

Congress MLA Jagga Reddy Fire on Trs Govt : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు చేశారు.

Update: 2020-08-06 11:04 GMT
జగ్గారెడ్డి ఫైల్ ఫోటో

Congress MLA Jagga Reddy Fire on Trs Govt : సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ కేబినెట్ నిర్ణయాలపై విమర్శలు చేశారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి కాకుండా సెక్రటేరియట్ నిర్మాణం గురించే చర్చ జరిగిందని అన్నారు. సెక్రటేరియట్ భవనం ఏ డిజైన్ లో కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి? వంటి అంశాలపైనే కేబినెట్‌ సమావేశంలో చర్చించారు కానీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి మాట్లాడడం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కరోనాకేమో రూ.100 కోట్లు కేటాయించడం, సచివాలయ భవన నిర్మాణానకిి రూ.500 కోట్లు కేటాయించడం ఏంటని? మానవత్వం లేని ప్రభుత్వం ఇదే అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఓ వైపు కరోనా మహమ్మారి బారిన పడి జనం బలి అవుతుంటే సమావేశంలో చర్చించాల్సింది సచివాలయం గురించా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ మీద చూపించిన శ్రద్ధ ఆస్పత్రులపైనా, తెలంగాన ప్రజలపైన పెడితే మంచిదని హితవు పలికారు.

ఒక వేల మంత్రి తలసాని శ్రీనివాస్‌ కరోనా బారిన పడితే ఆయన గాంధీలో చేరుతానన్నారని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తలసాని ఓ మంత్రి కాబట్టి గాంధీ ఆస్పత్రిలో చేరినా చుట్టూ 50 మంది వైద్యులను ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి పెట్టుకుంటారని విమర్శించారు. అనే సాధారణ వ్యక్తి కరోనా బారిన పడితే అలాంటి వైద్యమే చేస్తారా అని ప్రశ్నించారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలోనే దీక్ష చేస్తానని అన్నారు. ఇప్పటికైనా మంత్రులు భజన మండలి మానుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

ఇక ఈ రోజు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిపై జగ్గారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమ నేతగా, ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags:    

Similar News