IT Raids: మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి, బడంగ్‌పేట్‌ మేయర్‌ ఇళ్లలో ఐటీ సోదాలు

IT Raids in Hyderabad: హైదరాబాద్ బాలాపూర్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2023-11-02 05:33 GMT

IT Raids: మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి, బడంగ్‌పేట్‌ మేయర్‌ ఇళ్లలో ఐటీ సోదాలు

IT Raids in Hyderabad: హైదరాబాద్ బాలాపూర్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత పారిజాత నివాసంలో తనిఖీలు చేపట్టారు. బడంగ్‌పేట్ మేయర్‌గా పారిజాత ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. ఉదయం 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పారిజాత కుమార్తె ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ పారిజాత తిరుపతిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, శంషాబాద్‌ వద్ద కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌) ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేఎల్‌ఆర్‌ పోటీ చేస్తున్నారు.

Tags:    

Similar News