Minister KTR: ఐటీలో మనమే మేటి..
Minister KTR: గత ఎనిమిదేళ్లలో ఐటీలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Minister KTR: గత ఎనిమిదేళ్లలో ఐటీలో తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021, 22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ సాధించిన పురోగతి వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మించి రాణించామన్నారు. టాస్క్ రిసోర్స్ బుక్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
2021, 22లో ఐటీ ఎగుమతుల విలువ ఒక లక్షా 83 వేల 569 కోట్లనీ చెప్పారు. ఇది గతేడాది కంటే 26.14 శాతం ఎక్కువన్నారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 50 వేల కొత్త ఉద్యోగాలు కల్పించామన్నారు. నేషనల్ ఎక్స్ పోర్ట్స్ 17.2 శాతం ఉంటే తెలంగాణ 26.14 శాతం ఉందని, ఇది 9 శాతం ఎక్కువని చెప్పారు. 2035 కల్లా ITIR సపోర్ట్ లేకుండానే 13 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.