కొమురం భీం ఆశయాలను కేసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారంటూ.. మంత్రి కేటిఆర్ ట్వీట్
KTR: జల్ జంగల్ జమీన్ ఆచరణలో పెట్టామన్న మంత్రి కేటిఆర్
KTR: నీళ్ళు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాకుండా జల్.. జంగల్.. జమీన్... అనే కుమ్రం భీం కలలను కూడా సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మంత్రి కేటిఆర్ కొనియాడారు. కొండకోనల్లోని నివాసాలకు మిషన్ భగీరథతో నీటిని అందించి కొమురం భీం "జల్" నినాదం, రాష్ట్రంలో 7.70 శాతం అడవి పెరిగిందని దీంతో "జంగల్" నినాదం, రాష్ట్రంలో 1.51 లక్షల మందికి 4 కోట్ల 60 లక్షల ఎకరాల "జమీన్" ఇచ్చామని ఈ విధంగా కొమురం భీం ఆశయాలు సాకారం చేశామని కేటిఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. పోడు భూముల గోడు తీర్చి గిరిజన - ఆదివాసీల ఆశలన్నీ నెరవేర్చుతున్నామని తెలిపారు. నేడు కేసిఆర్ గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తుండగా ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. పట్టాలతో పట్టాభిషేకం చేస్తున్న సమయం ఆసన్నమైందని, అడవిబిడ్డల అభ్యున్నతిలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం కేటిఆర్ ట్వీట్ చేశారు.