ఐదో రోజు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల విచారణ
* ఆరు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను సీబీఐ ఐదో రోజు విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న అధికారులు... ప్రత్యేక వాహనంలో వారిద్దరినీ సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంకా ఒక్క రోజు మాత్రమే కస్టడీ గడువు ఉండటంతో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల నుంచి మరికొన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.