International Tribals Day: నేడు అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవం

International Tribals Day: 1994లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ని ఆదివాసుల దినోత్సవంగా ప్రకటన

Update: 2021-08-09 05:20 GMT

నేడు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం (ఫైల్ ఇమేజ్)

International Tribals Day: ప్రకృతితో మమేకమైన జీవనం వారిది.. డోలు చప్పుల్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు ఆదివాసీ జీవన శైలి.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీల జీవన స్థితిగతులు మారలేదు.. ఆదివాసుల హక్కు పరిరక్షణ కోసం 1994లో ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9ని అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ప్రభుత్వాలు, పాలకులు ఎంత మారినా ఈ అడవిబిడ్డల బతులకు మారడం లేదు. ప్రకృతి ఒడినే ఆవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ ప్రకృతి ప్రసాదిత ఫలాలతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివాసీ గిరిజనుల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నామంటూ పాలకుటు చెబుతున్నాప్పటికి అవి అడవి బిడ్డలకు చేరడం లేదు. ఇప్పటికి విద్య, వైద్య, మంచి నీరు, రోడ్డు వంటి కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామలెన్నో ఉన్నాయి. చాలా గ్రామాలకు నేటికి రోడ్డు రవాణా సౌకర్యం లేక 108, 104, 102 వాహనాలు వెళ్లలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాగులు, వంకలు పొంగితే బాహ్య ప్రపంచానికి దూరంగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం 1975లో ఉట్నూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గిరిజనుల కోసం కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ గిరిజనుల అభివృద్ది కనిపించడం లేదు. నిదులు పక్కదారి పట్టడం పర్యవేక్షణ లోపంతో సర్కార్ సొమ్ము ఇతరుల ఖాతాలో చేరుతోంది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి అరకొర నిధులతో గిరిజనుల బతుకులు మారడం లేదు. అడవి తల్లిని నమ్ముకుని చూపిస్తున్న వీరికి సంక్షేమ ఫలాలు అందడం లేదు.. పనుల్లో నాణ్యత లోపం వల్ల ఎక్కువ కాలం నిలవడం లేదు.. గ్రామాలలో మెరుగైన వైద్యం అందక ఏటా వ్యాధులతో ఎంతోమంది గిరిజన ప్రజలు మృత్యువాత పడుతున్నారు..

అనాదిగా అడవి బిడ్డలు సాగు చేసుకుంటున్న భూములకు నేటికి పట్టాలు రాలేదు హక్కు పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేదని గిరిజనులు వాపోతున్నారు. అటు అటవీశాఖ అధికారుల పోడు భూముల తమ పరిధిలోనివి అంటూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఆదివాసులకు ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా విద్య వైద్యం, రవాణా, తాగు నీటి సౌకర్యాలను, ఐటీడీఏ ద్వారా మరిన్ని నిధులు పల్లెల అభివృద్ధికి కేటాయించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News