నేటి నుంచి ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
*ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
Inter Exams 2022: తెలంగాణ, ఏపీ రాష్ట‌్రాల్లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా ఇంటర్ బోర్డులు విడుదల చేశాయి. మే 6 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఉదయం 8 గంటల నిమిషాలలోపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. పరీక్షల కోసం మొత్తం 1వెయ్యి 442 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు ఎగ్జామ్ సెంటర్లలో కోవిడ్ నిబంధనల అమలుతోపాటు వేసవి తీవ్రత నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇంటర్ పరీక్షలకు మొత్తం 9లక్షల7వేల3వందల96 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో పరీక్షల నిర్వహణకు 25వేల513మంది ఇన్విజిలెటర్లను ఎంపిక చేశారు. మాస్ కాపీంగ్ కట్టడి చేసేందుకు మొత్తం 75 మంది ఫ్లైయింగ్ స్కాడ్స్, మరో 150సిట్టింగ్ స్కాడ్ ను నియమించారు. ఇక ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో ఆశావర్కర్ , ఏఎన్ ఎం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గదుల ఎదుట షామియానాలు ఏర్పాటు చేసి ఎండవేడి గదుల్లోకి రాకుండా చూస్తున్నారు.
ఇటు ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండీయర్ కలిపి మొత్తం 9,14,423 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వృత్తి విద్య పరీక్షలు 87,435 మంది రాయనున్నారు. ఏపీలో 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలున్న మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ఏవీ చేయకుండా నడుపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకులపై దుమారం లేచింది. ఇంటర్ పరీక్షలు సజావుగా జరగాలని అధికారులు భావిస్తున్నారు.