Disha Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ

* నేడు పలువురు సాక్ష్యులను విచారించనున్న కమిషన్ * కేసు విచారణపై అధికారులను ప్రశ్నించిన కమిషన్ చైర్మన్

Update: 2021-08-27 05:00 GMT

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ (ఫైల్ ఫోటో)

Disha Encounter Case: సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్‌ నేడు విచారించనుంది. కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని నిందితుల కుటుంబసభ్యులకు సమన్లు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ 18 మంది సాకులను విచారించనుంది. నిన్న విచారణ ప్రారంభం కాగా ఎన్‌కౌంటర్‌ బాధిత కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. తొలిరోజు పలువురు పోలీసు అధికారులను సాక్షులుగా కమిషన్‌ విచారించింది.

ఎన్‌కౌంటర్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తీరును దిశ కమిషన్ ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి పలు ప్రశ్నలు సంధించింది. అయితే కొన్ని సమాధానాలకు కమిషన్ సభ్యులు సంతృప్తి చెందలేదు. సిట్ సమర్పించిన నివేదికలో ఉన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సిట్ అధికారి కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక ఈరోజు మరోసారి పలువురు సాక్షులను కమిషన్ విచారించనుంది. ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల నుంచి కూడా కమిషన్ స్టేట్‌మెంట్ తీసుకోనుంది. మరోవైపు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్‌కుమార్, శివల కుటుంబసభ్యుల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News