మిషన్ భగీరథ పనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెబితే పరువు పోతుందని కనీసం మా సొంత గ్రామానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. మిషన్ భగీరథపై జరుగుతున్న పనుల జాప్యాన్ని సీఎంఓ కార్యదర్శి స్మిత సభర్వాల్ దృష్టికి తీసుకవెళ్లారు. కనీసం జనవరి చివరి వరకు గడువు పెట్టుకున్న ఫిబ్రవరి వరకు పనులు పూర్తి చేసి తాగునీరు ఇవ్వాలని మంత్రి అధికారులను అదేశించారు.