Rains: 48 గంటల పాటు భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

Rains: హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. చాలా రోజుల తర్వాత నేడు వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోతు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-08-12 01:17 GMT

Rains: 48 గంటల పాటు భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

Rains: హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉదయం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతోంది. అయితే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణశాఖ కీలక అప్ డేట్ చేసింది. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో కూడా సోమవారం, మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని..జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

Tags:    

Similar News