Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు
Telangana: మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. వచ్చే మూడు రోజులు మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అటు ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.