Konda Vishweshwar Reddy: ఇంతకీ ఆయన ఎవరి టీమ్‌లో ఉంటారు.. ఎవరి టీమ్‌తో నడుస్తారు?
Konda Vishweshwar Reddy: ఆ లీడర్ దారెటు? నుట్రాల్ అంటూ యూటర్న్ తీసుకున్నారా?
Konda Vishweshwar Reddy: ఆ లీడర్ దారెటు? నుట్రాల్ అంటూ యూటర్న్ తీసుకున్నారా? అందరివాడు అంటూ కొందరికి లాభం చేసే పని చేస్తున్నారా? కొన్నాళ్లు రేవంత్‌తో, ఆ తర్వాత సంజయ్‌తో సఖ్యతగా ఉంటున్న ఆయన కప్పుకునేది ఏ పార్టీ కండువా? ఇంతకీ ఆయన ఎవరి టీమ్‌లో ఉంటారు.? ఎవరి టీమ్‌తో నడుస్తారు? ఇంతకీ ఎవరతను?
ఆయనే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. చేవెళ్ల మాజీ ఎంపీ. అప్పుడెప్పుడో నా వల్ల కాదంటూ గులాబీ గూటి నుంచి వచ్చి హడావిడి చేసిన కొండా ఆతర్వాత తన టెంపోను తగ్గించారు. కొంతకాలంగా ఇటు రేవంత్‌రెడ్డి టీమ్‌తో, అటు బండి సంజయ్ టీమ్‌తో సఖ్యతగా ఉంటూ వస్తున్నారే కానీ తనకూ ఓ టీమ్ ఉందని చెప్పుకోలేకపోతున్నారట. మంత్రి కేటీఆర్‌తో పాటు కొండాకు కూడా రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్‌కు స్పందించారు. కాంగ్రెస్‌తో తనకేం పని అన్నట్లుగా కాకుండా ఓకే చెప్పి గన్‌పార్క్ వద్ద రేవంత్‌తో జతకట్టారు. రేవంత్‌ను పక్కన పెట్టుకొని బండి సంజయ్‌కు వైట్ ఛాలెంజ్ విసిరారు. అంతే స్పీడ్‌గా బండి సంజయ్ కూడా వైట్ చాలెంజ్‌కు ఓకే చెప్పారు. అలా తాను బీజేపీతోనూ టచ్‌లో ఉన్నట్టు చెప్పారు.
అంతేకాదు హుజురాబాద్ ఉపఎన్నికలో తన మద్దతు ఈటల రాజేందర్‌కే అంటూ బహిరంగంగా ప్రకటించారు. తన లక్ష్యం టీఆర్ఎస్‌ను గద్దె దించడమే అంటూ తన సన్నిహితుల వద్ద చెబుతున్న కొండా ఏదో ఒక పార్టీలో ఉంటేనే కానీ వర్కవుట్ అవదు. ప్రస్తుతానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో సఖ్యతగా ఉంటూ వస్తున్నా వాట్ నెక్ట్స్ అన్న క్వశ్చన్ తెరపైకి వస్తుంది. కొండా అనుచరగణం కూడా రేవంత్‌తో కాంగ్రెస్ యాక్టివ్ అయ్యింది కాబట్టి తిరిగి సొంత గూటికే చేరుదామని పట్టుబడుతున్నారట. మరికొందరు మాత్రం కేంద్రంలో అధికారంలో వచ్చే పార్టీ వైపే వెళ్దామంటూ బీజేపీ వైపు ఎంకరేజ్ చేస్తున్నారట.
వాస్తవానికి, రాజీనామా చేశాక రాజకీయాలకు దూరంగా ఉన్న కొండా మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్‌తో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒక దశలో ఈటలతో కలిసి కొండా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ కూడా జరిగింది. అయితే, ఈటల బీజేపీలో చేరడంతో సైలెంట్ అయ్యారు. తర్వాత పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక, కొండా తిరిగి కాంగ్రెస్‌లోకి రాబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. ఇటు, కాంగ్రెస్, అటు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొండా ఈటల బీజేపీలో చేరకుముందు ఆయన్ను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారనే ప్రచారం జరిగింది అప్పట్లో. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్‌పై దూకుడుగా వ్యవహరిస్తున్న కొండా ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్నది ఉత్కంఠగా మారింది. ఎవరెన్ని విధాలుగా రెచ్చగొట్టినా ఆయనింకా వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నారని చర్చ సాగుతుంది. మరి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మదిలో ఏముందో కాలమే సమాధానం చెప్పాలి.