Heavy Rains: తెలంగాణకు బిగ్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..ఎల్లో అలర్ట్ జారీ
Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో కాస్త తక్కువగానే కురుస్తున్నప్పటికీ..తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో గత కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే పలు ప్రాంతాలకు వరద నీరు వచ్చి నిండిపోయాయి. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలోనే నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జనం బయట తిరగకూడదని అధికారులు చెబుతున్నారు. వర్షం పడేటప్పుడు ఇంట్లోనే ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.