Palwancha: పాల్వంచ పట్టణoలో అమలుకాని టిఎస్ బీపాస్

Palwancha: పాల్వంచ పట్టణoలో అమలుకాని టిఎస్ బీపాస్

Update: 2022-02-24 03:19 GMT

పాల్వంచ పట్టణoలో అమలుకాని టిఎస్ బీపాస్

Palwancha: భదాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మున్సిపాలిటీలలో ప్రతి ఇంటి నిర్మాణానికి టి ఎస్ బిపాస్ ద్వారానే అనుమతులతో మంజూరు చేయాలనిచట్టం ఉంది. అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మున్సిపాలిటీల్లో జి ప్లస్ ఫ్లోర్ వరకే పరిమితమైన అనుమతులు ఉన్నాయి. బడా బాబులు నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా పార్కింగ్ కు కేటాయించే సెల్లార్ ను సైతం నివాస సముదాయాలు మార్చేస్తున్నారు. జి ప్లస్ ఆరు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు.

అక్రమ కట్టడాల యజమానులకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వంత పాడుతున్నారంటూ పట్టణ వాసులు మండిపడుతున్నారు. అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై మున్సిపల్ చట్టాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 

Tags:    

Similar News