తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు పెరగవు: ఐఐటీ ప్రొఫెసర్స్

Update: 2021-05-06 11:21 GMT

తెలంగాణలో జూన్ నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరగదంటోన్న ఐఐటీ ప్రొఫెసర్లు

Telangana Covid Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలానే పలు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా చేయి దాటిపోతోంది. ఈ క్రమంలో తెలంగాణలోకూడా నిత్యం వేల సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కేసుల విషయంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్.. జూన్ నుంచి కరోనా కేసులు తగ్గుతాయని పేర్కొంటున్నారు.

తెలంగాణలో ఊహించిన దాని కంటే కొంచెం అటు ఇటుగా ఫలితాలు రానున్నట్లు తెలిపారు. కంప్యూటేషనల్ మోడల్ తో ఆయన ఈ ఫలితాను వెల్లడించారు. దీని ప్రకారం..మే20 నుంచి జూన్ 21 నాటికి క్రమంగా కేసుల సంఖ్య తగ్గి, ఆ తరువాత ఒకేలా మెయింటైన్ అవుతాయన్నారు.

మే 12నుంచి మే20వరకు భారీగా కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. అలాగే జూన్ 12న తర్వాత ఈ సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. ఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల టీం ఈ మోడల్ తో అంచాలను ప్రకటించాయి. రాష్ట్రంలో ఈ మధ్యనే 10వేల కేసులు నమోదు అయ్యాయి. 10వేల మార్కు చేరిన తర్వాత కేసుల సంఖ్య 6వేల 500 నుంచి 8వేలకు మధ్యలోనే ఉండాలని ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.

Tags:    

Similar News