Revanth Reddy: నేడు సీఎం చేతుల మీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం
Revanth Reddy: చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ
Revanth Reddy: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది విద్యార్థులకు చేనేత మరియు టెక్స్‌టైల్ సాంకేతికతతో సంవత్సరాల డిప్లొమా కోర్సును అభ్యసించడానికి అవకాశం కలుగుతుందని, సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత మరియు టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా అందజేయనున్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 36వేల,133 మంది లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.