Food Adulteration: కల్తీ అవుతున్న చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు

Food Adulteration: శుభ్రతలేని ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌ల తయారీ

Update: 2023-05-06 06:29 GMT

Food Adulteration: కల్తీ అవుతున్న చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు

Food Adulteration: పసి పిల్లలు తాగే పాలే కాదు.. ఇష్టంగా తినే చాకెట్లు, ఐస్‌క్రీమ్‌లు కల్తీ అవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాధించాలనే ఆలోచనతో కొంత మంది వ్యాపారులు శుచి, శుభ్రత లేని ప్రాంతాల్లో కలుషిత నీటితో ఐస్‌క్రీమ్ లు తయారు చేస్తున్నారు. మోతాదుకు మించి సింథటిక్‌ కలర్లు వాడుతున్నారు. వాటికి ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలను పోలీన లేబుళ్లను అతికించి గుట్టుగా మార్కెట్లోకి వదులుతున్నారు.మరికొంత మంది ఏకంగా చాక్లెట్లలో ప్రమాదకరమైన డ్రగ్స్‌ కలుపుతున్నారు. ఈ విషయం తెలిక తింటున్న చిన్నారులు వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో పాటు నరాల బలహీనత, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులను ఇంట్లోనే తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.

షాపూర్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల సమీపంలో డెలీషీయస్‌ ఐస్‌క్రీం తయారీ కంపెనీపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో పలు రకాల ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. తయారీ కంపెనీకి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో పాటు అపరిశుభ్రమైన ప్రదేశంలో.. మోతాదుకు మించిన సింథటిక్‌ కలర్లతో ఐస్‌క్రీమ్‌లు తరయా చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన వాటిని కూడా బ్రాండెడ్‌ లేబుళ్లతో మార్కెట్లోకి తరలిస్తున్న వాటిని సీజ్‌ చేశారు.

కాటేదాన్‌ పారిశ్రామికవాడలో 24 కంపెనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా, వీటిలో 17 కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులు కల్తీ, నాసిరకంతో ఉన్నట్టు గుర్తించి, ఆ మేరకు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా రవి ఫుడ్స్‌ బిస్కెట్స్‌ కంపెనీ పరిమితికి మించి సింథటిక్‌ కలర్లు వాడుతున్నట్టు తేలింది. బేగంబజార్‌, తుర్కయాంజాల్‌, నాదర్‌గుల్‌, ఆల్మాస్‌గూడలోని పలువురు అల్లం వ్యాపారులు ఆలుగడ్డ పేస్ట్‌ను అల్లంలో మిక్స్‌ చేసినట్లు గుర్తించారు.

షాద్‌నగర్‌ మండలం రామచంద్రాపురం ఐస్‌క్రీం తయారీ కంపెనీలో కలుషిత నీటితో తయారు చేసిన ఐస్‌క్రీంతో పాటు నాసిరకం చాకోబార్‌లను విక్రయిస్తుండటంతో స్థానికులు ఇటీవల పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఐస్‌క్రీం షాపుపై దాడి చేసి 3 లక్షల రూపాయల విలువ చేసే బ్రాండెడ్‌ లేబుళ్లతో పోలిన నాసిరకం వెనీలా కప్స్‌,మ్యాంగో ఫ్లేవర్‌, స్ట్రాబెర్రి చాకోబార్ ఫ్లేవర్లను సీజ్‌ చేశారు.

ఆమనగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మెగా ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కలుషిత నీటితో తయారు చేసిన ఐస్‌క్రీంలకు ఆకర్షణీయమైన బ్రాండెడ్‌ లేబుళ్లతో వీటిని విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఐస్‌ తయారీ కేంద్రాన్ని సీజ్‌ చేయడంతో పాటు 10 లక్షల రూపాయల విలువ చేసే ముడిపదార్థాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News