Hyderabad: జీవించడానికి పనికిరాదా? స్వచ్ఛత ప్రమాణాలు దిగజారుతున్నాయా

Hyderabad Ease of living index:హైదరాబాద్‌లో దిగజారుతున్న స్వచ్ఛత ప్రమాణాలు

Update: 2021-03-07 10:54 GMT

హైదరాబాద్ ( ఇమేజ్ ఇన్ వికీపీడియా )

Hyderabad Ease of living index:భిన్న సంస్కృతులకు వేదిక హైదరాబాద్‌. అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటుంది. రిచ్‌ కిడ్‌ నుంచి స్ట్రీట్‌ కిడ్‌ వరకు అందరికీ వారి వారి స్టైల్లో లైఫ్‌ అందిస్తుంది ఈ మహానగరం. హైదరాబాద్‌ అంటేనే ఈజీ లీవింగ్‌. కానీ ఇప్పుడాలా లేదంటోంది ఓ సర్వే సంస్థ. హైదరాబాద్‌లో జీవించడాన్ని చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారట. ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్ ఎందుకులా వచ్చింది. స్వచ్ఛతలో హైదరాబాద్‌లో ఎందుకు వెనకడుగు వేస్తోంది.

హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని రాజకీయ నేతలు వేదికలపై డప్పులు వాయిస్తున్నారు. కానీ అంతా సీన్‌ లేదంటోంది స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే రిపోర్ట్. హైదరాబాద్‌ను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలు ముందుకు దూసుకువెళ్తున్నాయని సర్వే సంస్థ రిపోర్ట్ తేల్చేసింది.

మహానగరంలో స్వచ్ఛత ప్రమాణాలు దిగజారిపోతున్నాయని స్వచ్ఛ భారత్‌ మిషన్‌ చేపట్టిన సర్వే వెల్లడిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఇచ్చిన ర్యాంకుతో జీహెచ్ఎంసీ పాలక సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెరుగైన సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నగరాలను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే చేపడుతున్నారు.

2016లో దేశంలోని 73 నగరాలు ఈ పోటీలో పాల్గొంటే, హైదరాబాద్‌ నగరానికి 19వ ర్యాంక్‌ వచ్చింది. 2017 సర్వేలో 434 నగరాలు పాల్గొంటే హైదరాబాద్‌కు 22వ ర్యాంకు సొంతం చేసుకుంది. 2018లో 4041 నగరాలు పాల్గొంటే 27వ ర్యాంక్‌, 2019లో 35వ ర్యాంక్‌ లభించింది. 2020 లో 36 వ ర్యాంకు వచ్చింది. ఈ ఏడాది మహానగరానికి 24 ర్యాంకు వచ్చింది. హైదరాబాద్‌ ర్యాంకింగ్‌ గత ఏడాది కంటే కాస్త మెరుగుపడినప్పటికీ.. చెప్పుకోదగ్గ ర్యాంకింగ్‌ సాధించలేకపోతుందని నగరవాసులు భావిస్తున్నారు.


Tags:    

Similar News