విగ్గుతో ముగ్గులోకి.. అమ్మాయిలకు కుచ్చుటోపీ పెడుతున్న మాయగాడు..
Mohammad Rafi: తాను ఎన్నారైని అని చెప్పి, అమ్మాయిలను బుట్టలో వేసుకొని నగలు దోచుకుంటున్న మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Mohammad Rafi: తాను ఎన్నారైని అని చెప్పి, అమ్మాయిలను బుట్టలో వేసుకొని నగలు దోచుకుంటున్న మాయగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేశాడు. వారితో సహజీవనం చేయడం వీలైనప్పుడు డబ్బులు, నగలతో ఊడాయించడం. బట్టతలను విగ్గుతో కవర్ చేశాడు. మాటలతో కలరింగ్ ఇచ్చాడు. అమ్మాయిలు ట్రాప్‌లో పడగానే తన టార్గెట్ పూర్తిచేయడం. ఇదేదో బాగుందని దీన్ని కంటిన్యూ చేస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు ఆ మాయగాడు.
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకాలనీకి చెందిన మహిళకు ఇన్‌స్టాగ్రాంలో కార్తీక్‌వర్మ పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమెతో స్నేహంగా ఉండి 18.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదును దోచుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీగా గుర్తించారు.
పదో తరగతి చదువుకున్న రఫీ పాలిటెక్నిక్‌కు ఎగనామం పట్టేశాడు. 2010లో హైదరాబాద్‌కు వచ్చి కార్మికుడిగా పనిచేశాడు. జల్సాకు అలవాటు పడి వేదిస్తున్న రఫీని భార్య పిల్లలు వదిలేసి వెళ్లారు. ఇక అప్పటి నుంచి బట్టతలను విగ్గుతో కవర్ చేసి, అమ్మాయిలకు కుచ్చుటోపీ పెట్టడం మొదలుపెట్టాడు. చివరకు జైల్‌పాలయ్యాడు.