Hyderabad Police Alerted: ఎలాంటి ర్యాలీల‌కు అనుమ‌తుల్లేవు: కమిషనర్‌ అంజనీ కుమార్‌

Hyderabad Police Alerted: ఎన్నో ఏండ్లుగా ప్రజలంతా వేయి కండ్లతో వేచి చూస్తున్న అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమం ఈ రోజు అంటే అగస్టు 5వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు.

Update: 2020-08-05 06:59 GMT
anjini kumar

Hyderabad Police Alerted: ఎన్నో ఏండ్లుగా ప్రజలంతా వేయి కండ్లతో వేచి చూస్తున్న అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమం ఈ రోజు అంటే అగస్టు 5వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగరంలో మత కలహాలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని నగరపోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు అంజనీ కుమార్ మాట్లాడుతూ రామమందిర శంకుస్థాపన సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. సామూహికంగా గుమికూడి పూజలు చేయవద్దు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక ర్యాలీలకు అనుమతి లేదు. లడ్డూల పంపిణీకి కూడా అనుమతి లేదు. కాగా.. నగరంలో పలు పోలీస్‌ స్టేషన్స్‌కి సంబంధించిన కమ్యూనల్‌ రౌడీషీటర్‌లను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఎలాంటి సంఘటనల్లో పాల్గొనవద్దని పోలీసులు వారిని హెచ్చరించారు.

ఇక పోతే అయోధ్య నగరంలో మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలో రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి. నరసింహారావు. దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చ లా మిగిలిపోయింది. 09-11-2019 న అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి. 

Tags:    

Similar News