MMTS Trains: నేటి నుంచి పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్ రైళ్లు
MMTS Trains: హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
MMTS Trains: హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు దాదాపు 15 నెలల తరువాత ఈరోజు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎంఎంటీఎస్ రైళ్ల ఆగిపోయాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేశారు. దీంతో ఇవాల్టి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 121 సర్వీసులకు ప్రస్తుతం 10 సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. పరిస్థితి అదుపులో ఉంటే జులై ఒకటి నుండి మరో యాబై సర్వీసులను నడపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికను సిద్ధంచేసింది.