Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు

Hyderabad Metro: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు చేసారు.

Update: 2021-05-31 06:26 GMT

హైదరాబాద్ మెట్రో రైల్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Hyderabad Metro: తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు చేసారు. ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని హైద్రాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. చివరి రైలు ఉదయం 11.45కు మొదలై గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుతుందని వెల్లడించారు. ప్రయాణికులు మాస్కులు, శానిటైజర్ ఉపయోగించాలని సూచించింది. ప్రతి మెట్రో స్టేషన్‌‌లోనూ హ్యాండ్ శానిటైజర్లతో పాటు థర్మ స్క్రీనింగ్‌ను అందుబాటులో ఉంచారు.ప్రయాణికులంతా ఖచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. అందరూ మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Full View


Tags:    

Similar News