ఆ రాత్రి.. ఆ గర్భిణీ కోసం ప్రత్యేకంగా మెట్రో!
Hyderabad Metro: హోరు వానలో గమ్యస్థానం చేరాగాల్ని ఇబ్బందులు పడుతున్న గర్భిణీ కోసం ప్రత్యేకంగా మెట్రో రైలు నడిపారు.
సమయం రాత్రి 9:30 గంటలు కావస్తోంది... హోరున వాన కురుస్తోంది. అది హైదరాబాద్ లోని వీఆర్ (కొత్తపేట) మెట్రో స్టేషన్. ఒక గర్భిణీ ఆ రాత్రి సమయంలో అక్కడికి వచ్చింది. తాను మియాపూర్ వెళ్ళాలనీ.. కానీ, తనకు బస్సులు..ఆటోలు అందుబాటులో లేవనీ అక్కడి సిబ్బందికి చెప్పింది. కోవిద్ నిబంధనలతో మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే తిరుగుతున్నాయి. ఆమె అక్కడికి వచ్చే సమయాణానికే రాత్రి మెట్రో ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడి సిబ్బంది అదే విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో ఆమె ఆ సిబ్బందిని ఎలాగైనా తాను మియాపూర్ వెళ్లాలనీ.. దానికి దారి చూపించమని వేడుకుంది. దీంతో అక్కడి సిబ్బంది పై అధికారులకు విషయాన్ని చేరవేశారు. తమ ప్రయత్నంగా ఆమె పరిస్థితిని వ్విఅరించి చెప్పారు. విషయం విన్న అధికారులు సత్వరమే స్పందించారు. వెంటనే కేవలం ఆమె ఒక్కరి కోసమే మెట్రో సర్వీసును ఏర్పాటు చేశారు. అక్కడ సరిగ్గా పదిగంటలకు ఆమెను మెట్రోలో ఎక్కించుకుని నలభై నిమిషాల్లో మియాపూర్ చేర్చారు. క్షేమంగా ఆమె గమ్యస్థానానికి చేరుకోవడానికి సహకరించారు.
ఈ విషయాన్ని మెట్రోరైలు భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ఆ నిబంధన ప్రకారమే ఆమెను ఆ సమయంలో సురక్షితంగా ప్రత్యేక మెట్రోలో గమ్యస్థానాయికి చేర్చామని చెప్పారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. ఆపద సమయంలో ఆదుకున్న మెట్రో ను నగర వాసులు అభినందిస్తున్నారు.
ఇక పొతే, దసరా నేపథ్యంలో మెట్రో చార్జీల్లో భారీ రాయితీలు ప్రకటించారు. వీటిని ఉపయోగించుకుని మెట్రోలో సురక్షితంగా ప్రయాణించాలని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.