Micro Art on Rice: బియ్యపు గింజలపై భగవద్గీత..స్వారిక అరుదైన ఘనత!

హైదరాబాద్ కు చెందిన స్వారిక బియ్యపు గింజల పై భగవద్గీతను రాసి రికార్డు సృష్టించింది.

Update: 2020-10-20 07:22 GMT

swarika with her micro art Image from ANI twitter

కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత. దీనిలో ఉన్న శ్లోకాలను పుస్తకంలో చదవడానికే ఎన్నో తిప్పలు పడాలి. ఇక బియ్యపుగింజ ఎంత ఉంటుందో తెలుసుకదా.. దాని మీద ఒక అక్షరం రాయగలరా? అక్షరం కాదుకదా ఒక చుక్క పెన్నుతో లేదా పెన్సిల్ తో పెట్టాలంటే ఎంతో కష్టం. అసలు బియ్యపు గింజ మీద ఏదైనా రాయాలనే ఆలోచనే ఎవరికీ రాదు. కానీ, హైదాబాద్ కు చెందిన యువతి బియ్యపు గిన్జలపై ఏకంగా భగవద్గీత రాసేసింది.

ఈ ఘనత సాధించిన ఆమె పేరు రామగిరి స్వారిక. హైదరాబాద్ కు చెందిన లా విద్యార్ధిని. దేశంలోనే తొలి మైక్రో గుర్తింపు పొందింది. ఈమె గతంలో బియ్యపు గింజలపై పలు రకాల కళాకృతులు సృష్టించింది. ఇప్పుడు ఆమె భగవద్గీతను బియ్యపు గింజలపై రాసి అందరి ప్రశంశలు పొందుతోంది. 

మొత్తం 4,042 బియ్యపు గిన్జలపై ఈమె భగవద్గీతను రాశారు. ఈ క్రతువును పూర్తి చేయడానికి 150 గంటలు పట్టినట్టు స్వారిక చెప్పారు. మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలను బియ్యపు గింజల పై రాసినట్టు తెలిపారు. తనకు కళలపై చిన్నతనం నుంచి ఆసక్తి ఎక్కువనీ, అందుకే ఈ పని చేశానని వివరించారు. నాలుగేళ్ల క్రితం గణేశుడి చిత్రాన్ని బియ్యపు గింజపై వేయడం ద్వారా ఈ కళను ప్ర్రారంభించినట్టు చెప్పారు. తరువాత ఒకే బియ్యం గింజ పై ఆంగ్ల అక్షరాలూ అన్నీ రాసినట్టు తెలిపారు. 



Tags:    

Similar News