Hyderabad: కరోనా బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా..

Hyderabad: గాంధీ ఆస్ప‌త్రిని సీఎం కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు.

Update: 2021-05-19 09:07 GMT

Hyderabad: కరోనా బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా..

Hyderabad: గాంధీ ఆస్ప‌త్రిని సీఎం కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. మంత్రి హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్ కుమార్‌తో కలిసి ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.

గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై అక్కడి వైద్యులతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కాగా సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రోగుల స‌హాయ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ర‌సాయ‌నాల‌తో పిచికారీ చేశారు. ఇక గాంధీ ఆస్పత్రి కోవిడ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News