గో కార్టింగ్‌ ప్రమాదంలో యువతి మృతి

Update: 2020-10-08 11:26 GMT

గో కటింగ్ ప్లే జోన్ లో తీవ్రగాయాలైన ఓ యువతి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగర శివారులోని గుర్రంగూడలో చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలిసి గో కటింగ్ ప్లే జోన్ కి వచ్చిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శ్రీ వర్షిని ప్లే జోన్ లో ఉన్న కారు లో తన స్నేహితులతో షికారు చేద్దామనుకుంది. తన స్నేహితుడు కారు డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిని పక్కనే కూర్చున్నది. కాస్త దూరం వెళ్లిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి శ్రీ వర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తన స్నేహితులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే మీర్‌పేటకు చెందిన శ్రీ వర్షిని ఆమె స్నేహితుడితో కలిసి గో కటింగ్ కి వెళ్లారు. సరదాగా కాసేపు కారులో ప్రయాణం చేద్దామనుకున్న ఇద్దరు కారును తీసుకొని ట్రాక్ లో ప్రయాణం ప్రారంభించారు.

సరిగ్గా అదే సమయంలో కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. అమ్మాయి వెంట్రుకలు కారు చక్రంలో చుట్టుకపోవడంతో హెల్మెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ తరువాత అమ్మాయి కూడా కింది పడింది. దీంతో శ్రీ వర్షిని తలకు బలమైన గాయాలు అయ్యాయి. అది గమనించిన స్నేహితులు హుటాహుటిన శ్రీ వర్షినిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా శ్రీ వర్షిని తల్లిదండ్రులు గో కాటింగ్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో గో కటింగ్ కు అనుమతి ఇవ్వడం పైన అటు తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గో కటింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందంటూ శ్రీ వర్షిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News