Hyderabad Becomes Corona Hotspot: కరోనా హాట్‌స్పాట్ లిస్టులో హైదరాబాద్..
Hyderabad Becomes Corona Hotspot: రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి.
Hyderabad Becomes Corona Hotspot: రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు హైదరాబాద్ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. ఇదే తరహాలో అటు బెంగళూరు, పుణే నగరాల్లో కూడా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మొదట్లో కేసీఆర్ సర్కారు కరోనా టెస్టులను పెద్దగా పట్టించుకోనప్పటికీ, ఇప్పుడు మాత్రం బాగానే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే నగరంలోని పరిసర ప్రాంతాల్లో జులై 16 నాటికి 2.22 లక్షలకుపైగా సంఖ్యలో టెస్టులను చేసింది.
ఇక కరోనా టెస్టులు చేయడానికి కావలసిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కిట్లను తెప్పించింది. అవి సరిపోవన్న అంచనాతో మరో 5 లక్షల యాంటీజెన్ టెస్టులను చేయాలని భావిస్తోంది. ఇప్పటికే వీటి కోసం దక్షిణ కొరియా సంస్థకు ఆర్డర్ పెట్టినట్టు సమాచారం. ఇప్పటి వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేశారు. ఇక జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ర్యాపిడ్ కిట్లు వచ్చాక వాటిని జిల్లాలకు కూడా ఎక్కువ సంఖ్య పంపించనున్నారు. ఒక్కో పీహెచ్‌సీలో రోజుకు వంద టెస్టులు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా హాస్పిటళ్లు, పీహెచ్‌సీల్లోనూ కోవిడ్ టెస్టులు చేస్తారు. గంటలోపే ఫలితం వస్తుండటంతో ర్యాపిడ్ టెస్టుల పట్ల జనం ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు తెలిపారు. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కె.చంద్రశేఖర్ రెడ్డి ఐసీఎంఆర్ అనుమతి పొందిన సంస్థ దగ్గర్నుంచి ర్యాపిడ్ కిట్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.