Hyderabad Hair Mafia: హైదరాబాద్ కేంద్రంగా వెంట్రుకల మాఫియా ఆగడాలు
*హైదరాబాద్ కార్గో నుంచి చైనా, మయన్మార్‌లకు వెంట్రుకల ఎగుమతి *తిరుపతి, సింహాచలంతో పాటు సెలూన్ల నుంచి వెంట్రుకలను కొనుగోలు
Hyderabad Hair Mafia: హైదరాబాద్ కేంద్రంగా వెంట్రుకల మాఫియా ఆగడాలు కొనసాగిస్తున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్న వెంట్రుకల కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ కార్గో నుంచి చైనా, మయన్మార్‌లకు వెంట్రుకల ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు. తిరుపతి, సింహాచలంతో పాటు సెలూన్ షాప్ ల నుంచి వెంట్రుకలను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ఏడాదికి దాదాపు 6 వేల నుంచి 8వేల కోట్ల వ్యాపారం అక్రమంగా జరుగుతోందని ఈడీ గుర్తించింది.
మరోవైపు హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఆర్టీసీ కాలనీలో నరేష్ అనే వ్యక్తి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ తనిఖిల్లో మూడు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. మహిళల వెంట్రుకలు కొని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. నరేష్ ఇంటితో పాటు గుంటి జంగయ్య కాలనీల్లోనూ ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లో 9చోట్ల గుంటూరులోనూ సోదాలు నిర్వహించారు. విదేశీ నిబంధనలు ఉల్లంఘిస్తూ కంపెనీ పుస్తకాల్లో తక్కువ ధర చూపుతూ ఎక్కువ మొత్తంలో తెరవెనుక ఆర్థికలావాదేవీలు నడుస్తున్నట్టు గుర్తించారు.