Hyderabad Tops Public Surveillance in India: హైదరాబాదుకి అరుదైన గౌరవం!
Hyderabad Tops Public Surveillance in India: అత్యధిక సీసీటీవీ కెమెరాలు కలిగి ఉన్న నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదటి స్థానం సంపాదించింది
Hyderabad Tops Public Surveillance in India: అత్యధిక సీసీటీవీ కెమెరాలు కలిగి ఉన్న నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మొదటి స్థానం సంపాదించింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సీసీటీవీ కెమెరాల నిఘా ఉన్న నగరాల్లోనూ తొలి 20 స్థానాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. మూడు అత్యధిక నిఘా కెమెరాలతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యధికంగా పర్యవేక్షించబడే 20 నగరాల్లో 16 వ స్థానంలో ఉందని యుపికి చెందిన కంపారిటెక్ అనే సంస్థ ఈ జాబితాను వెల్లడించింది. అయితే దీనిపైన హైదరాబాద్ మాజీ పోలీసు చీఫ్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నగర పోలీసులకు అభినందనలు వెల్లడించారు.
UK #Comparitech Rept : #HyderabadCity with 3Lakh surveillance cameras ranked 16 among the Top20 #MostSurveilledCities across the world. (*Usage, No.of cameras & Safety).
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 23, 2020
Congratulations to all the stakeholders firstly #TheCommunities for making the city a safer place to live in. pic.twitter.com/a0JpFh6pWp
ఇక కంపారిటెక్ అనే సంస్థ నివేదిక ప్రకారం సర్వియలన్స్‌లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. తొలి 20 నగరాల్లో 18 చైనాలోనివే కావడం విశేషం. ఇందులో తైయువాన్ అనే నగరం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 4.65 లక్షల సీసీటీవీ కెమెరాలను నిఘా ఉంచారు. ఈ నగరంలో 3,891,127 మంది నివసిస్తున్నారు. ఇక 3 లక్షల సీసీటీవీ కెమెరాలతో హైదరాబాద్ 15వ స్థానంలో నిలిచింది. అంటే దీని అర్థం ప్రతి 1,000 మందికి 29.99 సిసిటివి కెమెరాలు ఉన్నాయని.. ఇక ఈ సర్వే విషయంలో చెన్నై 21, దిల్లీ 33 స్థానాలలో ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న నేరాలను అరికట్టడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్రలు పోషిస్తునాయి, వీటి ఆధారంగా నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకి చాలా ఈజీ అవుతుంది. ఇక వీటి ఉపయోగాన్ని గుర్తించి చాలా మంది తమ ఇంటి భద్రత కోసం ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను పెట్టుకుంటున్నారు.