Huzurabad - Badvel ByPoll: నేడు బద్వేల్‌, హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌

* అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు * భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రక్రియ

Update: 2021-10-30 02:16 GMT

నేడు బద్వేల్‌, హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌(ఫోటో- ది హన్స్ ఇండియా)

Huzurabad - Badvel ByPoll: మొన్నటి వరకు నేతల వంతు. ఇప్పుడు ఓటర్ల వంతు వచ్చేసింది. హుజురాబాద్‌ ప్రజలు తమ ఓపీనియన్‌ను చెప్పే టైం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్‌ మరో గంటలో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనంత మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా భారీ పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్‌ ప్రక్రియ సాగనుంది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు, 5 మండలాలు, 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5 మండలాల్లో మొత్తం 2లక్షల 37వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 306 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా 107 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక బలగాలను మోహరించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్న అధికారులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉప ఎన్నిక కోసం మొత్తం 421 కంట్రోల్‌ యూనిట్లు, 891 బ్యాలెట్‌ యూనిట్లు, 515 వీవీ ప్యాట్‌లను వినియోగిస్తున్నారు. అలాగే 1,715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. 306 పోలింగ్‌ స్టేషన్లలో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. నవంబర్‌ 2న కరీంనగర్‌లోని ఎస్‌ ఆర్‌ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. నేతల వాహనాలను సైతం చెక్‌ చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలని శషాంక్‌ గోయల్‌ సూచించారు.

Tags:    

Similar News