Telangana: పెండింగ్ చలాన్లపై రాయితీలకు భారీ స్పందన
Telangana: తొలి మూడు రోజుల్లోనే రూ.39 కోట్లు వసూలు
Telangana: తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన పెండింగ్ చలాన్లకు భారీ స్పందన వస్తోంది. తొలి మూడు రోజుల్లోనే 39 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి పెండింగ్ చలానాలు చెల్లించేందుకు వీలు కల్పించడంతో వాహనదారులు వేగంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, ఈ-చలాన్ వైబ్‌సైట్‌లోకి వెళ్లి చలానాలను కడుతున్నారు. ఒక సెకన్‌కు గరిష్టంగా 45 వేల హిట్లు వచ్చాయని, నిమిషానికి 700 చలాన్లను చెల్లింపులు చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. మార్చి 1న 8 లక్షలు, మార్చి 2న 15 లక్షలు, మార్చి 3న 16 లక్షల చలానాలను వాహనదారులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.