తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్

TS Assembly Elections 2023: ఏపీలో తెలంగాణ ఎన్నికలపై బెట్టింగ్

Update: 2023-11-30 02:08 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ 

TS Assembly Elections 2023: తెలంగాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రేపు పోలింగ్ ట్రెండు ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన చర్చ జరుగుతుంది.

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ ఓటమి పాలవుతుంది? అన్నది ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ జరుగుతున్న చర్చ. ఇక ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను గురించి ఆంధ్రప్రదేశ్లో జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయని చర్చ జరుగుతుంది.

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీ వారికి ఆసక్తి ఎందుకు అంటే.. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణా ఎన్నికలపై ఏపీ ప్రజలకు ప్రత్యేకమైన ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వారు బెట్టింగ్ లు పెట్టే దాకా తీసుకెళ్ళింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలో బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగ్ కాస్తున్నారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరోమారు మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బోణి కొడుతుందా? తెలంగాణలో బిజెపికి ఎన్ని స్థానాలు వస్తాయి? వంటి అనేక అంశాల పైన బెట్టింగ్లు మొదలుపెట్టారు.

ఇక అంతే కాదు అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాలుగా చెబుతున్న కొన్ని నియోజకవర్గాల పైన కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి.గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గెలుస్తాడా? ఓడిపోతాడా? కామారెడ్డి లో కేసీఆర్ గెలుస్తారా.. ఓడిపోతారా? కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుస్తాడా లేదా? నల్గొండలో కోమటిరెడ్డి విజయం సాధిస్తారా లేదా? అని కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News